EBOOK

Poli
A Long Poem On Agriculture (Telugu)
Rachapalem Chandra Sekhara Rachapalem Chandra Sekhara Reddy(0)
About
పొలి' కావ్యం 2007లో మొదటిసారి ప్రచురించాను. ఈ కావ్యాన్ని పాఠకులు, సమీక్షకులు బాగా స్వీకరించారు. కనీసం 20 మంది వ్యాసాలు, సమీక్షలు రాశారు. 'పొలి' కావ్యాన్ని 'నేటినిజం' పత్రికా సంపాదకులు బైసదేవదాసుగారు ఒకేసారి తన పత్రికలో అచ్చు వేశారు. దానిని చదివిన కవి, సినీ నిర్మాత ఎం.ఎస్.రెడ్డిగారు పొలి తాను ప్రచురిస్తానన్నారు. నేను అప్పుడే పొలి కావ్యాన్ని ప్రచురించాను గదా! ఆ విషయం ఆయనకు చెప్పాను. అయినా ఫరవాలేదు తాను ప్రచురిస్తానన్నారు. పంపాను. అయితే ఆయన కొంతకాలానికి కన్నుమూశారు. నేను కడప యోగివేమన విశ్వవిద్యాలయంలో పని చేస్తున్నప్పుడు, అనంతపురంలోని నా మిత్రుడు డా. పతికి రమేష్ నారాయణ 'పొలి' కావ్యాన్ని ఆంగ్లంలోకి అనువదించి, తానే అచ్చు వేయించి, 450 ప్రతులను నాకు బహుకరించారు. అది నా జీవితంలో మరచిపోలేని బహుమానం. 2015లో ఆయన ద్విభాషా కావ్యంగా 'పొలి'ని ప్రచురించి, కె. శివారెడ్డిగారితో మంచి వీఠిక రాయించారు. ఇప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా నాకు పరిచయమై, నన్ను బాగా గౌరవించే మిత్రుడు సుధీర్‌రెడ్డిగారు నా పుస్తకాలను డిజిటలైజేషన్ చేయించి పాఠకులకు అందుబాటులో పెట్టడానికి ప్రయత్నిస్తూ, 'పొలి' ని ఎన్నుకున్నారు. ఆయన సహృదయత నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది మూడవ ముద్రణ అవుతుంది. సుధీర్ రెడ్డిగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ కావ్యాన్ని 15 ఏళ్ళుగా చదువుతున్న పాఠకులకు నా కృతజ్ఞతలు.
21.01.2023 - రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
21.01.2023 - రాచపాళెం చంద్రశేఖరరెడ్డి